అక్షరటుడే, వెబ్‌డెస్క్: BiggBoss-9 winner Kalyan | తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 విజేత Telugu Bigg Boss Season 9 winner టైటిల్‌ను కామన్ మన్ కళ్యాణ్ (Kalyan Padala) సొంతం చేసుకున్నారు. అత్యధిక ఓట్లు రావడంతో కళ్యాన్ విజేతగా నిలిచినట్లు హోస్ట్ నాగార్జున Host Nagarjuna ప్రకటించారు. రన్నరప్‌గా నటి తనూజ Actress Tanuja నిలిచారు. మరో కామన్ మన్ డెమాన్ పవన్ టాప్-3లో ఉన్నారు. టాప్-4, టాప్–5 స్థానాల్లో ఇమ్మాన్యు యేల్, సంజన ఉండటం గమనార్హం. బిగ్‌బాస్–9 మొత్తం 105 రోజుల పాటు సాగింది. ఫినాలేతో ఈ ఈ రియాలిటీ షో ముగిసింది. కాగా, 9 సీజన్లనూ పురుషులే విజేతలుగా నిలిచారు.
BiggBoss-9 winner Kalyan | రూ. 35 లక్షల క్యాష్ ప్రైజ్
ఈసారి తనూజా కచ్చితంగా గెలుస్తుందని అందరూ భావించినా నిరాశే మిగిలింది. ఐదుగురితో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మొదలైంది. మొదట సంజన, ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యారు. డెమోన్ పవన్ రూ.15 లక్షల సూట్ కేస్ ఆఫర్‌తో బయటకొచ్చారు. దీంతో కళ్యాణ్, తనూజ మిగిలిపోయారు. దీంతో వీరిని బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజీపైకి కింగ్ నాగార్జున తీసుకొచ్చారు. కల్యాణ్ చేయి పట్టుకుని విజేతగా ప్రకటించారు. ఈమేరకు కల్యాణ్ రూ.35 లక్షల క్యాష్ ప్రైజ్, సుజుకీ విక్టోరిస్ Suzuki Victories కారు, రాఫ్ టైల్స్ ద్వారా రూ.5 లక్షల బహుమతి సొంతం చేసుకున్నారు.
బిగ్ బాస్ 9 Bigg Boss-9 గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి Megastar Chiranjeevi చీఫ్ గెస్ట్‌గా వస్తారని ప్రచారంలో ఉండగా.. ఆయన రాలేదు. కానీ, స్పెషల్ గెస్ట్‌గా హీరో శ్రీకాంత్ actor Srikanth వచ్చారు. సంజనను బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీకాంత్ బయటకు తీసుకొచ్చారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి, హీరో నవీన్ పొలిశెట్టి కూడా బిగ్ బాస్ స్టేజీపై సందడి చేశారు. వీరిద్దరు కూడా ఇమ్మాన్యూయెల్‌ను హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు. డేమాన్ పవన్‌కు రవితేజ రూ.15 లక్షల సిల్వర్ సూట్ కేస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు.