HomeUncategorizedBig Boss Season 9 | బిగ్‌బాస్ సీజన్ 9 రేప‌టి నుండి మొద‌లు.. కామనర్స్...

Big Boss Season 9 | బిగ్‌బాస్ సీజన్ 9 రేప‌టి నుండి మొద‌లు.. కామనర్స్ vs సెలబ్రిటీలు థీమ్‌తో ఆదివారం గ్రాండ్ స్టార్ట్!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Big Boss Season 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కి ఇక మరికొన్ని గంటలే మిగిలి ఉంది. సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభంకానుండగా, మరోసారి కింగ్ నాగార్జున(King Nagarjuna )హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఇప్పటికే షోపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా సీజన్ 9 కంటెస్టెంట్ల జాబితా బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా, ఈ సీజన్‌లో కామన్ మాన్‌కు కూడా చోటు లభించింది. ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు’ అనే కాన్సెప్ట్‌తో సీజన్ 9 ముందుకు సాగనుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్న ఈ సీజన్‌లో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ ఉంటారు.

  • సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే అంటూ ఓ వార్త హ‌ల్ చేస్తుంది.
  • సంజనా గల్రానీ – బుజ్జిగాడు మూవీతో గుర్తింపు పొందిన నటి
  • రీతూ చౌదరి – యాంకర్‌గా, జబర్దస్త్ వంటి షోలతో పాపులర్ అయింది
  • తనూజ గౌడ – పాపులర్ టీవీ యాక్ట్రెస్
  • ఆశాషైనీ – నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలతో గుర్తింపు
  • శ్రష్ఠి వర్మ – కొరియోగ్రాఫర్, డ్యాన్స్ షోలతో పాపులర్
  • భవాణి శంకర్ – సీరియల్ నటుడు
  • సుమన్ శెట్టి – పాపులర్ కమెడియన్ (జయం, 7/G బ్రిందావన్ కాలనీ)
  • రాము రాథోడ్ – ఫోక్ సింగర్, యూట్యూబ్ సంచలనం
  • ఇమ్మానుయేల్ – జబర్దస్త్ కామెడీ స్టార్

కామనర్స్ లైన్-అప్ చూస్తే:

బిగ్‌బాస్ టీమ్ నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’ (Agni Pariksha)లో విజయం సాధించిన 6 కామనర్స్‌ను హౌస్‌లోకి పంపనున్నారు. వీరిలో 4 మేల్, 2 ఫీమేల్ కంటెస్టెంట్లు ఉండనున్నారు. ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన కామనర్స్

శ్రీజ దమ్ము

మాస్క్ మ్యాన్ హరీష్

కల్యాణ్ పడాలా

మర్యాద మనీష్

దివ్యా నికితా

ఇంకో స్థానం కోసం డిమోన్ పవన్ మరియు నాగ ప్రశాంత్ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. వీరిలో ఒకరు చివరి కంటెస్టెంట్‌గా ఎంపిక కానున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది. సెప్టెంబర్ 7, ఆదివారం రాత్రి 7:00 గంటలకు స్టార్ మాలో లాంచింగ్ ఎపిసోడ్ ప్ర‌సారం కానుంది. జియో హాట్‌స్టార్ (Jio Hotstar) యాప్‌లో 24×7 లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. కామనర్స్ & సెలబ్రిటీలు కలిసి హౌజ్‌లో సంద‌డి చేయ‌నుండ‌డంతో ఈసారి షో మరింత ఆసక్తికరంగా మారనుంది. గ‌త సీజ‌న్‌లో క‌న్నా ఈ సారి కొత్త ఫార్మాట్, బలమైన కంటెస్టెంట్లు ఉండటంతో బిగ్‌బాస్ 9(Big Boss Season 9)లో మరింత ఇంటెన్స్ డ్రామా, ప‌వ‌ర్ ఫుల్ టాస్క్‌లు, ఎమోషనల్ మూమెంట్స్‌తో నిండిపోవడం ఖాయం.