HomeసినిమాKannada Big Boss | బిగ్​బాస్ కన్నడ సీజన్ 12కు భారీ దెబ్బ.. నిబంధనల ఉల్లంఘనలతో...

Kannada Big Boss | బిగ్​బాస్ కన్నడ సీజన్ 12కు భారీ దెబ్బ.. నిబంధనల ఉల్లంఘనలతో స్టూడియో సీజ్, క‌రెంట్ క‌ట్

Kannada Big Boss | బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. స్టూడియోను తిరిగి తెరవాలంటే హైకోర్టు అనుమతి తప్పదని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో షో కొనసాగుతుందా, లేక పూర్తిగా నిలిపివేస్తారా అన్నది చూడాలి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kannada Big Boss | కర్ణాటక(Karnataka)లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 12’ కు భారీ షాక్ తగిలింది. పర్యావరణ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘిస్తూ, చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలతో రామనగర జిల్లా బిదాడిలోని జోలీవుడ్ స్టూడియోను రెవెన్యూ శాఖ, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Karnataka State Pollution Control Board) అధికారులు లాక్ చేశారు.

KSPCB జారీ చేసిన నోటీసుల అనంతరం రెవెన్యూ శాఖ (Revenue Department) అధికారులు బిగ్ బాస్ హౌస్‌కు (Big Boss House) చేరుకుని, స్టూడియోని త‌క్షణ‌మే ఖాళీ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా స్టూడియోకు విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని బెస్కామ్ (బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ) మేనేజింగ్ డైరెక్టర్‌కు కేఎస్ పీసీబీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ మూసివేత అమలులో ఉంటుందని పేర్కొంది.

Kannada Big Boss | పెద్ద స‌మ‌స్యే..

పోటీదారులందరూ మంగ‌ళ‌వారం సాయంత్రం 7 గంటలలోపు ఇంటి నుండి బయటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో వారిని వేరే ప్రాంతానికి త‌ర‌లించిన‌ట్టు తెలుస్తుంది. పర్యావరణ శాఖ పరిశీలనలో, జోలీవుడ్ స్టూడియోకు నీటి మరియు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేవని తేలింది. దీంతో పాటు, కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. అనుమతి లేకుండా స్టూడియోలో షూటింగ్ కార్యకలాపాలు నిర్వహించడం చట్టవిరుద్ధమని KSPCB స్పష్టం చేసింది.

అటవీ, పర్యావరణ మరియు జీవశాస్త్ర శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ పరిణామాల‌పై స్పందిస్తూ, “రామనగర కార్యాలయాన్ని ఇప్పటికే పరిశీలించి, స్టూడియో యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు జారీ చేశాం. అయినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోలేదు. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా కార్యకలాపాలు కొనసాగించడం చట్టవిరుద్ధం. చట్టపరమైన చర్యలు తప్పవు, అని ఆయన హెచ్చరించారు. మంత్రి ప్రకటన తరువాత, అధికారులు సైట్‌ను పరిశీలించి, స్టూడియోలో అక్రమ నిర్మాణాలు, పర్యావరణానికి హాని చేసే చర్యలు ఉన్నాయా అనే దానిపై సాక్ష్యాలు సేకరిస్తున్నారు. తహశీల్దార్ తేజస్విని, బిదాడి ఇన్‌స్పెక్టర్ శంకర్ నాయక్, అలాగే ఆర్‌.ఐ., వి.ఏ. అధికారులు కలిసి జోలీవుడ్ స్టూడియోలో సమగ్ర తనిఖీ చేపట్టారు. స్టూడియోలో పర్యావరణ ప్రమాణాలకు విరుద్ధమైన నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. పరిస్థితి తీవ్రంగా ఉంటే, స్టూడియోను పూర్తిగా మూసివేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.