ePaper
More
    HomeసినిమాBigg Boss 9 | గ్రాండ్‌గా బిగ్ బాస్ లాంచింగ్​.. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్...

    Bigg Boss 9 | గ్రాండ్‌గా బిగ్ బాస్ లాంచింగ్​.. హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 (Bigg boss 9) ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడ‌గా.. ఎట్ట‌కేల‌కి కొద్దిసేప‌టి క్రితం గ్రాండ్‌గా లాంచ్ అయింది.

    నేటి (సెప్టెంబర్ 7) రాత్రి 7 గంటలకు స్టార్ మా ఛానల్‌లో బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్​గా లాంఛ్ ఎపిసోడ్ ప్రారంభం అయింది. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే అంటూ బిగ్ బాస్ సీజన్ 9కి హైప్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున (host Nagarjuna).

    ఈసారి సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు హౌజ్‌లోకి అడుగుపెట్టారు. ఐదుగురు కామ‌న‌ర్స్ హౌజ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

    ముందుగా ర‌క్ష‌కుడు సినిమాలోని సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగ్.. హౌస్ టూర్ చూపించిన తరువాత.. టాప్ 13 అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్‌‌ రివీల్ చేసి వారితో మాట్లాడుతూ.. మీలో ఐదుగురు మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్నారని చెప్పి షాకిచ్చారు.

    Bigg Boss 9 : ర‌ణ‌రంగం..

    ముందుగా అగ్ని పరీక్షలో నెగ్గిన మాస్క్ మ్యాన్ హరీశ్​ని (Harish) పరిచయం చేస్తూ.. నువ్వు సత్తా చుపించావ్ అంటూ అతడిని పొగిడేశారు.

    అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి ఐదుగురు కంటెస్టెంట్స్‌ మాత్రమే వెళ్లారు. వారిలో ఇద్దర్ని జ్యూరీ మెంబర్స్‌ (అగ్నిపరీక్ష జడ్జీలు) సెలెక్ట్ చేశారు. మిగతా ముగ్గురూ ఓటింగ్ ద్వారా ఎంపిక చేయబడ్డారని నాగ్ తెలిపారు.

    ఇక ‘అగ్ని పరీక్ష’ సీరియల్​తో ఫేమ్ సంపాదించుకున్న తనూజా ఫస్ట్ హౌస్ మేట్‌గా ఎంట్రీ ఇస్తూ ఆమె నాగార్జున కోసం మటన్ బిర్యానీ తీసుకొచ్చింది.

    ఇక ఆ త‌ర్వాత సెలబ్రిటీ కోటాలో సీనియర్ నటి ఆశా సైనా సెకండ్ హౌస్ మేట్​గా ఎంట్రీ ఇచ్చి అద‌ర‌గొట్టింది. ‘నరసింహ నాయుడు’ సినిమాలో లక్స్ పాపగా ఈ అమ్మ‌డు చాలా సుప‌రిచితం.

    ఇక ఫస్ట్ కామనర్​గా జవాన్ కళ్యాణ్​ను బిగ్ బాస్ (Bigg Boss) ఇంట్లోకి పంపారు. అత‌నికి ఓ ప‌రీక్ష పెట్టారు. తనూజా, ఫ్లోరా సైనీలలో వాష్ రూమ్ డ్యూటీ చేసే కంటెస్టెంట్​ని సెలెక్ట్ చేయమని చెప్ప‌గా.. చివరకు ఫ్లోరా సైనీని ఎంపిక చేశాడు కళ్యాణ్.

    జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్.. బిగ్ బాస్ ఇంట్లోకి నాలుగో కంటెస్టెంట్​గా అడుగుపెట్టి అందరిని స‌ర్‌ప్రైజ్ చేశాడు. ‘అమ్మా అమ్మా’ అనే పాటని రెండు వేర్వేరు గొంతులతో పాడి అల‌రించాడు.

    జానీ మాస్టర్ వివాదంతో పాపులారిటీ సంపాదించుకున్న లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మని ఐదో కంటెస్టెంట్​గా బిగ్ బాస్ హౌస్​లోకి పంపారు. నాగార్జున కోసం ‘కన్నె పెట్టరో కన్ను కొట్టరో’ పాటకు డ్యాన్స్ చేసి అల‌రించింది.

    ‘అగ్ని పరీక్ష’ దాటుకొని వచ్చిన మాస్క్ మ్యాన్ హరీశ్​ని ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఆరో కంటెస్టెంట్​గా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపారు. ఇంట్లో ఎవరు మాస్క్ తో ఉన్నా, వారి మాస్క్ ని తొలగించడం చేస్తాన‌ని అన్నాడు.

    అనంత‌రం ఎన్నో సీరియల్స్, సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు భరణీ శంకర్ ఎంట్రీ ఇచ్చాడు. ‘బిగ్ బాస్’ హౌస్ లోకి 7వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది రీతూ చౌద‌రి.

    ఇక భరణి 8వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. కామనర్స్ కోటాలో డీమన్ పవన్​ను హౌజ్‌లోకి పంపారు. ఇక ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గ‌రైన నటి సంజన గల్రానీ Sanjana.. 10వ కంటెస్టెంట్ గా ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ ఇచ్చింది.

    ‘రాను బొంబాయికి రాను’ అనే సాంగ్​తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న రామూ రాథోడ్.. 11వ కంటెస్టెంట్​గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టాడు.

    దమ్ము శ్రీజని 12వ కంటెస్టెంట్‌గా న‌వ‌దీప్ Navdeep సెలెక్ట్ చేశారు. కమెడియన్ సుమన్ శెట్టి 13వ కంటెస్టెంట్‌గా, చివరి సెలబ్రిటీ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి త‌న స‌త్తా చూపిస్తాన‌ని అన్నాడు.

    ‘బిగ్ బాస్’ హౌస్ లోకి 14వ కంటెస్టెంట్‌గా కామనర్ ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. ‘అగ్ని పరీక్ష’ నుంచి వచ్చిన కామనర్ మర్యాద మనీష్.. 15వ కంటెస్టెంట్‌గా ‘బిగ్ బాస్’ హౌస్ లో అడుగుపెట్టాడు.

    అయితే మెయిన్ హౌస్​ని కామనర్స్ కి కేటాయించిన బిగ్ బాస్.. అగ్ని పరీక్ష గెలిచి వచ్చిన క్ర‌మంలో వారిని ఓనర్స్ గా పేర్కొన్నారు. సెలబ్రిటీలు అవుట్‌హౌస్‌లో ఉంటారని నాగ్ చెప్పుకొచ్చారు.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...