Homeటెక్నాలజీBigg boss 9 | బిగ్ బాస్ తెలుగు 9: మాస్క్ మ్యాన్ హరిత హరీష్...

Bigg boss 9 | బిగ్ బాస్ తెలుగు 9: మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఔట్‌.. కామనర్స్ కి కలిసిరాని కాలం!

బిగ్ బాస్ లో కామ‌నర్స్ బ‌య‌ట‌కు వెళుతుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎలిమినేషన్లలో ఇద్దరు కామనర్స్ వెళ్ళిపోవడం, ఇప్పుడు హరీష్ రూపంలో మూడో కామనర్ వెళ్ళిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా సాగితే, “కామనర్స్ vs సెలబ్రిటీల పోటీ వాస్తవంగా ఉందా?” అనే సందేహాలు కొందరిలో మొదలవుతున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : bigg boss 9 | స్టార్ మాలో (Star maa) ప్రసారమవుతోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9, ‘కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో మంచి హైప్‌తో ప్రారంభమైంది.

అయితే నాలుగు వారాలు పూర్తయ్యే సరికి కామనర్స్‌కే గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన మూడు ఎలిమినేషన్లలో ప్రియా శెట్టి (Priya Shetty), మర్యాద మనీష్ బయటకు వెళ్ల‌గా, ఇప్పుడు నాలుగో వారం మాస్క్ మ్యాన్ హరిత హరీష్ కూడా ఎలిమినేట్ కానున్న‌ట్టు తెలుస్తుంది. ఇలా కామనర్స్ వరుసగా హౌస్ నుంచి బ‌య‌ట‌కి వెళ్ల‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది..

Bigg Boss 9 | ఊహించని ఎలిమినేషన్..

ఈ వారం నామినేషన్‌లో రీతూ చౌదరి (Ritu Chaudhary), సంజన (Sanjana), ఫ్లోరా షైనీ, శ్రీజ దమ్ము, దివ్య నికిత, హరిత హరీష్ ఉండగా, స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న రీతూ, ఫ్లోరా, సంజన వంటి సెలబ్రిటీలకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ శ్రీజ, దివ్య, హరీష్ డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. మొదట శ్రీజ ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపించినా, ఆమె ఈ వారం మంచి పెర్ఫార్మెన్స్, కళ్యాణ్ పడాలతో జోడీ ట్రాక్ వల్ల సేఫ్ అయ్యింది.

ఫైనల్‌గా దివ్య, హరీష్ మధ్య పోటీలో హరిత హరీష్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. కామనర్‌గా మాస్క్ మ్యాన్ గెటప్‌లో హౌస్‌లోకి ప్రవేశించిన హరీష్, మొదటి వారం నుంచే తన యూనిక్ యాటిట్యూడ్‌తో ఫోకస్ తెచ్చుకున్నాడు. కానీ అతని సూటి మాటలు, కోపం కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీకి దారి తీశాయి. నాగార్జున కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం ఉంది.

అదనంగా, తనకి హౌస్‌మేట్స్ మద్దతు ఇవ్వలేదని అలిగి నిరాహార దీక్షకు దిగడం, ఆడియన్స్‌లో మిశ్రమ స్పందన తీసుకువచ్చింది. ఈ వారం చేతికి గాయం కావడం వల్ల హౌస్ టాస్కుల్లో పెద్దగా పాల్గొనలేకపోయాడు. అదే ఆడియన్స్ కనెక్ట్ మిస్ అయ్యేందుకు కారణమైంది. మొత్తంగా, అంచ‌నాల‌ని అందుకోలేక‌పోవ‌డం హరీష్ ఎలిమినేషన్‌కి (Elimination) దారితీస్తుంద‌ని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో నాలుగు వారాలు కొనసాగిన హరీష్, వారానికి రూ. 60,000 పారితోషికం పొందాడని తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 2.40 లక్షలు సంపాదించినట్లు సమాచారం. అయితే ప్రేక్షకుల మద్దతు లేకపోవడం వల్ల హౌస్ లో అత‌ని ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది.