HomeUncategorizedBig Boss Season 9 | బిగ్ బాస్ ఎదురు చూపుల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టే.. ఎప్ప‌టి...

Big Boss Season 9 | బిగ్ బాస్ ఎదురు చూపుల‌కి పులిస్టాప్ ప‌డ్డ‌ట్టే.. ఎప్ప‌టి నుంచి మొద‌లు కానుంది అంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Big Boss Season 9 | బిగ్‌బాస్(Reality Show Bigg Boss) రియాలిటీ షో మరోసారి టీవీ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు తొమ్మిదో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ షోను ఎంతగానో ఇష్టపడతారన్నది చెప్పనక్కర్లేదు. అయితే కొత్త సీజన్​ (Season 9) ఎప్ప‌టి నుంచి ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కి బిగ్​బాస్​ సీజన్​–9 ప్రారంభంపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

Big Boss Season 9 | మార్పుల‌తో..

బిగ్‌బాస్ సెప్టెంబర్ 7 నుంచి ప్రసారం కానుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ మేరకు విడుదలైన ప్రోమో వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగార్జున(Host Nagarjuna)  ఈ సీజన్‌కి కూడా హోస్ట్‌గా వ్యవహరించనుండగా, “ఈ సారి బిగ్‌బాస్‌ను మార్చేశా” అని చెప్పడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. నాగార్జున “బిగ్‌బాస్ మారాడు అని చెప్ప‌డంతో, ఈ సారి బిగ్‌బాస్ వాయిస్‌లోనూ మార్పు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మార్పులు షో ఫార్మాట్‌లోనూ ఉంటాయంటూ టీవీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నాడు. ఒకటి కాకుండా రెండు హౌస్‌లు ఉండబోతున్నాయన్నది తాజా సమాచారం. ఒక హౌస్‌లో సెలెబ్రిటీలు, మరొకటిలో సామాన్యులు నివసించనున్నారని తెలుస్తోంది. ఇదే ఈ సీజన్‌కి ప్రత్యేక ఆకర్షణ కానుంది.

బిగ్‌బాస్ టీమ్ ఇప్పటికే సామాన్యుల ఎంపిక కోసం “అగ్నిపరీక్ష”(Agni Pariksha) పేరుతో ప్రీ-షోను నిర్వహించింది. వేలాది దరఖాస్తుల నుంచి 15 మంది సామాన్యులను ఎంపిక చేశారు. వీరిలో ఎవరు షోలోకి అడుగుపెడతారో అన్నది ఇప్పటికి సస్పెన్స్‌గానే ఉంది. అయితే, వీరు సెలెబ్రిటీలతో పోటీగా నిలవాల్సి ఉండటంతో, ఈ సీజన్ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఈ సారి నూతన కాన్సెప్ట్స్, కొత్త మలుపులతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. డబుల్ హౌస్, డబుల్ డోస్, డబుల్ డ్రామా అని చెప్పుకుంటున్న ఈ సీజన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7 నుంచి బిగ్‌బాస్ హౌస్‌(Big Boss House)లో మళ్లీ హంగామా మొదలవబోతోంది!