HomeUncategorizedBigg Boss 9 Promo | ఈ సారి చ‌ద‌రంగం కాదు.. ర‌ణ రంగ‌మే.. ఆసక్తిక‌రంగా...

Bigg Boss 9 Promo | ఈ సారి చ‌ద‌రంగం కాదు.. ర‌ణ రంగ‌మే.. ఆసక్తిక‌రంగా బిగ్ బాస్9 ప్రోమో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Bigg Boss 9 Promo | బుల్లితెర ప్రేక్షకుల‌కు మంచి కిక్ ఇచ్చే షో బిగ్ బాస్ (Bigg boss). ఈ షో తెలుగులో ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు తొమ్మిదో సీజ‌న్‌కి సిద్ధంగా ఉంది. ఎప్పుడు మొద‌లవుతుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మ‌రోవైపు ఈ షోకి హోస్ట్‌గా ఎవరు ఉంటార‌నే చ‌ర్చ కూడా జోరుగా న‌డిచింది. వీట‌న్నింటికి తాజాగా విడుద‌లైన ప్రోమోతో కొంత క్లారిటీ వ‌చ్చింది. సీజన్ 9కు సంబంధించిన తొలి ప్రోమో విడుదల కాగా, అందులో కింగ్ నాగార్జున (King Nagarjuna) ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్‌తో వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు నాగ్.

Bigg Boss 9 Promo | ఇక మొద‌లే..

“ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు.. గెలుపు రావాలంటే యుద్ధం సరిపోదు, ప్రభంజనం సృష్టించాల్సిందే. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే..!” అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ప్రోమో, షోపై భారీ హైప్ క్రియేట్(Hype Create) చేసింది. ఈ వీడియోతో గత కొంతకాలంగా నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టిన రూమ‌ర్స్‌కి ఫుల్​స్టాప్ ప‌డింది.

గతంలో ఈ షోకు హోస్ట్‌గా బాలకృష్ణ, విజయ్ దేవరకొండ పేర్లు వినిపించినా, మళ్లీ నాగార్జుననే హోస్ట్‌గా కొనసాగుతారని ప్రోమోతో స్పష్టమైంది. గత సీజన్‌లో నిఖిల్ విజేతగా నిలవగా, అతను రూ. 55 లక్షల క్యాష్ ప్రైజ్, ట్రోఫీ, మారుతీ కారును గెలుచుకున్నాడు. 21 మంది కంటెస్టెంట్ల మధ్య తనదైన తీరులో ఆడి ప్రేక్షకులను ఆకట్టుకుని టైటిల్ దక్కించుకున్నాడు.

ప్రస్తుతం ‘బిగ్ బాస్ 9’ కంటెస్టెంట్స్ లిస్టు(Contestants list)పై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ఇటీవల ప్రసారమైన ‘కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2’ మరియు ‘కూక్ విత్ జాతిరత్నాలు’ కామెడీ షోలో పాల్గొన్న వారిలో కొంతమంది ఈ సీజన్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. లీకైన సమాచారం ప్రకారం.. ఈ సీజన్ ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ (September) మొదటి వారంలో ప్రసారం కానుంది. బిగ్ బాస్ షోకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న నేప‌థ్యంలో ఈ సీజన్​ను కూడా ఫుల్ డ్రామా, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.