అక్షరటుడే, ఇందూరు: Bigala Ganesh Gupta Statement | ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉందామని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని బీఆర్ఎస్ (BRS Party Nizamabad) కార్యాలయంలో ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.
Bigala Ganesh Gupta Statement | డబ్బు, మద్యం గెలిచాయి
బిగాల మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయన్నారు. అయినప్పటికీ మద్యం, డబ్బులే చివరికి విజయం సాధించాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని.. ప్రజల మధ్యే ఉండి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుందామని బిగాల అన్నారు. విరోచితంగా పోరాడి ఓడిన అభ్యర్థులు ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ పార్టీకి పూర్వవైభవం తీసుకు రావాలని సూచించారు. ఎల్లప్పుడూ పార్టీ నాయకులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..
రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్రంలో (Telangana Politics) వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బిగాల గణేష్ గుప్తా అన్నారు. అప్పటివరకు నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటూ.. ముందుకు సాగాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో సమస్యల పరిష్కారంలో ప్రజలతో కలిసి ముందుకు నడుద్దామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యప్రకాశ్, సుజిత్సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
