అక్షర టుడే, వెబ్‌డెస్క్: Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ నియోజకవర్గ (Jubilee Hills constituency) ఉప ఎన్నిక చుట్టూ రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పోరును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం, వ్యూహాలు, కౌంటర్ ప్లాన్లతో రంగం సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ (BRS) అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Jubilee Hills by-election | బీఆర్ఎస్ సేఫ్ ప్లాన్
ఎలాంటి ప్రమాదం తలెత్తినా పార్టీకి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా బీఆర్ఎస్ ఒకే స్థానానికి ఇద్దరితో నామినేషన్లు వేయించింది. పార్టీ ఇప్పటికే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత (Maganti Sunitha) పేరును అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె పార్టీ తరఫున మూడు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
అయితే, నామినేషన్ తిరస్కరణ లేదా సాంకేతిక కారణాలతో ఏదైనా సమస్య తలెత్తిన పరిస్థితిలో పార్టీకి ప్రతినిధి లేకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకే బీఆర్ఎస్ మరో ప్లాన్ అమలు చేసింది. ఇందులో భాగంగా దివంగత నేత పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి (former MLA P. Vishnuvardhan Reddy) కూడా పార్టీ తరఫున నామినేషన్ వేయించారు. ఈ చర్యతో బీఆర్ఎస్ BRS “డ్యామేజ్ కంట్రోల్” సిద్ధంగా ఉంచినట్టే.
ఇక అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) కూడా ఈ ఉప ఎన్నికను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ప్రచారాన్ని ఉద్ధృతం చేసేందుకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు తదితరులకు చోటు కల్పించింది. తాజాగా కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కి (MLA Danam Nagender) కూడా ప్రచార బృందంలో స్థానం ఇవ్వడం గమనార్హం.
ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ బలగాలను కేంద్రీకరించి ఫీల్డ్‌లోకి దిగాయి. బీఆర్ఎస్ వ్యూహాత్మక నామినేషన్‌లు, కాంగ్రెస్ భారీ ప్రచార బృందం, బీజేపీ సైలెంట్ క్యాంపెయిన్ ఇవన్నీ కలిపి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను మరింత రసవత్తర రాజకీయ పోరాటంగా మార్చేశాయి. మొత్తం మీద, జూబ్లీహిల్స్‌లో ఈసారి ఓటు యుద్ధం కేవలం అభ్యర్థుల మధ్యనే కాదు వ్యూహం వర్సెస్ వ్యూహంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.