అక్షరటుడే, వెబ్‌డెస్క్: AP Liquor Scam | ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(YCP MP Mithun Reddy) అరెస్ట్ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు విజయవాడ కోర్టులో (Vijayawada Court) అరెస్ట్ వారెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠకు దారితీస్తోంది. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా న్యాయస్థానం నుంచి ఊరట రాలేదు.
AP Liquor Scam | అరెస్ట్ తప్పదా..
విచారణ సందర్భంగా మిథున్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ (Senior Advocate Abhishek Singhvi) వాదిస్తూ.. మిథున్ రెడ్డి ఇప్పటికే సిట్ విచారణకు సహకరించారు, హాజరయ్యారు. కనుక అరెస్ట్ అవసరం లేదు అని చెప్పారు. ప్రభుత్వం తరపున ముఖుల్ రోహత్గీ(Mukul Rohatgi) వాదనలు వినిపించారు. అయితే ధర్మాసనం మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఖండించింది. అదే సమయంలో, ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదంటే అరెస్ట్ అవసరమా?” అనే ప్రశ్నను సైతం కోర్టు ఎత్తిచూపింది. మిథున్ తరఫు న్యాయవాదులు సరెండర్‌కు కొంత సమయం కావాలని కోరగా, ధర్మాసనం.. “టేక్ యువర్ టైం” అంటూ స్పష్టమైన వ్యాఖ్య చేసింది.
సిట్ అధికారులు (Sit Officers) మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వారెంట్ కోసం విజయవాడ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. మిథున్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని సిట్ గుర్తించే ప్రయత్నాల్లో ఉంది.
పార్లమెంట్ సమావేశాలు(Parliament Sessions) ప్రారంభం కావాల్సిన ఈ సమయంలో ఆయన అరెస్ట్ సంచలనం సృష్టించే అవకాశముంది. ఈ కేసులో మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోందన్న భావన వెలువడుతోంది. ఇప్పటికే బెయిల్ నిరాకరణతో పాటు, సిట్ అధికారుల చర్యలు కూడా అరెస్ట్ ఖాయమని సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఆయన అరెస్ట్ జరిగితే ఏపీ రాజకీయాలు చర్చనీయాంశంగా మారడం ఖాయం. మొత్తానికి, లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి సంబంధించి తదుపరి కొన్ని గంటలు లేదా రోజులు కీలకం కానున్నాయి.