అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asia Cup | ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో విజేతగా భారత్ గెలిచినప్పటికీ, ట్రోఫీ చుట్టూ తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. ఈసారి వివాదానికి కేంద్రబిందువైన వ్యక్తి పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ.
ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్తతలు మైదానంలోనూ చోటు చేసుకోవడం మనం చూశాం. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లకి షేక్ హ్యాండ్(Shake Hand) ఇవ్వడం నిరాకరించింది. దీనిపై పాక్ మాజీ ఆటగాళ్లు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే టోర్నీ ముగిసాక కూడా వివాదం రాజుకుంటూనే ఉంది.
Asia Cup | కప్ వివాదం..
భారత జట్టు విజయాన్ని గుర్తించి విన్నింగ్ ట్రోఫీ అందజేయాల్సిన బాధ్యత మోహ్సిన్ నఖ్వీకి ఉన్నప్పటికీ, ఆయన ట్రోఫీని తీసుకెళ్లి ఇంకా భారత జట్టుకు అందజేయలేదు. నఖ్వీ చేతుల మీదుగా మాత్రమే ట్రోఫీ అందించాలని ఐసీసీ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. ట్రోఫీ ప్రస్తుతం దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. బీసీసీఐ(BCCI) ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ వివాదాన్ని వచ్చే నెల ఐసీసీ సమావేశంలో లేవనెత్తడానికి సిద్ధమైంది. అంతేకాదు, మోహ్సిన్ నఖ్వీని ఐసీసీ డైరెక్టర్ పదవి నుండి తొలగించాలన్న డిమాండ్ కూడా బీసీసీఐ చేస్తున్నది. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఉన్న నేపథ్యంలో, నఖ్వీకి అధికార పదవి కోల్పోవడం ఖయమేనని వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బీసీసీఐ వర్గాల ప్రకారం, “ఆసియా కప్(Asia Cup) అధికారిక హోస్ట్‌గా ఉన్న భారత క్రికెట్ బోర్డుకి ట్రోఫీ అందించాల్సిన హక్కు ఆయనకు ఉంది. కానీ మోహ్సిన్ నఖ్వీ నిరాకరించినందున, ఆయన ఈ చర్యకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.. ఏసీసీ ప్రతినిధి వివరాల ప్రకారం, తన అనుమతి లేకుండా ట్రోఫీ ఎక్కడికి తీసుకెళ్లరాదు అని నఖ్వీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట.. భారత జట్టు లేదా బీసీసీఐ నుంచి ఎవరైనా వచ్చినా, ఆయన చేతుల మీదుగా మాత్రమే ట్రోఫీ అందజేస్తానని స్పష్టం చేశారట. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వివాదం అంతర్జాతీయ క్రికెట్ వేదికపై పెద్దగా హాట్ టాపిక్‌గా మారే అవకాశముంది. బీసీసీఐ ఈ విషయాన్ని ఐసీసీ సమావేశంలో అధికారికంగా చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలని యత్నిస్తోంది.