Homeతాజావార్తలుKTR | కేటీఆర్​కు బిగ్​ షాక్​.. ఫార్ములా ఈ-రేసు కేసులో విచారణకు గవర్నర్​ అనుమతి

KTR | కేటీఆర్​కు బిగ్​ షాక్​.. ఫార్ములా ఈ-రేసు కేసులో విచారణకు గవర్నర్​ అనుమతి

ఫార్ములా ఈ–కారు రేసు కేసులో కేటీఆర్​ విచారణకు గవర్నర్​ అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను విచారించి ఛార్జిషీట్​ దాఖలు చేయనున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​కు షాక్​ తగిలింది. ఫార్ములా ఈ–కారు రేసు కేసులో ఆయన విచారణకు గవర్నర్​ అనుమతించారు. దీంతో ఏసీబీ అధికారులు (ACB Officers) ఆయనపై అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది.

బీఆర్​ఎస్​ హయాంలో హైదరాబాద్​ నగరంలో ఫార్ములా ఈ–కారు రేసు (Formula E Car Race) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్​ ఆరోపించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చాక ఆ కేసు విచారణను ఏసీబీకి అప్పగించింది. ఈ కేసులో ఏ–1 కేటీఆర్​, ఏ–2గా సీనియర్​ ఐఏఎస్​ అధికారి అరవింద్ కుమార్ (IAS Officer Arvind Kumar) పేర్లను ఏసీబీ చేర్చింది. మాజీ మంత్రి కేటీఆర్​ను ఇప్పటికే నాలుగు సార్లు విచారించింది. అరవింద్​ కుమార్​ను సైతం పలుమార్లు విచారించి కీలక విషయాలు రాబట్టింది. అనంతరం కేటీఆర్​ ప్రాసిక్యూషన్​కు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్​కు గతంలో లేఖ రాసింది. దీంతో ఆయన విచారణకు అనుమతి ఇచ్చారు.

KTR | అరెస్ట్​ తప్పదా..

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్​ఎస్​ (BRS) హయాంలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిపై విచారణ చేపడుతోంది. కాళేశ్వరం కమిషన్​ (Kaleshwaram Commission) విచారణ పూర్తయింది. ఫోన్​ ట్యాపింగ్​ విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసు విచారణ సైతం అధికారులు చేపడుతున్నారు. కేటీఆర్​ను అరెస్ట్​ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. కేటీఆర్​ (KTR) సైతం అరెస్ట్​ చేస్తే కొన్ని రోజులు రెస్ట్​ తీసుకుంటానని గతంలో వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆయనను అరెస్ట్ చేయలేదు. తాజాగా ఫార్ములా ఈ–రేసు కేసులో విచారణకు గవర్నర్​ అనుమతి రావడంతో ఆయనను అరెస్ట్​ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే కేటీఆర్‌పై అధికారులు అభియోగాలు నమోదు చేయనున్నారు. విచారణ తర్వాత ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఛార్జీషీట్​ దాఖలు అనంతరం అరెస్ట్​ చేస్తారా.. లేదా అనే విషయాలు తెలియనున్నాయి.