అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Congress | స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (YellaReddy Constituency) రామారెడ్డి (Ramareddy) మండల బీఆర్ఎస్ నాయకులు సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (Mla madna Mohan) ఆధ్వర్యంలో రామారెడ్డి మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పాక్స్ సొసైటీ డైరెక్టర్ రాజేందర్, గిద్ద గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్లు నర్సవ్వ, రాజవ్వ, రమేష్ రెడ్డి పార్టీలో చేరారు. వారితో పాటు సీనియర్ నాయకులు లింబారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరో 30మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీని వీడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, రామారెడ్డి మాజీ సర్పంచ్ రంగు రవీందర్, ఏఎంసీ డైరెక్టర్ రవూఫ్, నాయకులు అరవింద్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.