Homeబిజినెస్​Flipkart | ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌’ ఆఫర్‌.. రూ.52 వేలకే ఐఫోన్‌ 16!

Flipkart | ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌’ ఆఫర్‌.. రూ.52 వేలకే ఐఫోన్‌ 16!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Flipkart | ఐఫోన్‌ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) గుడ్‌న్యూస్‌ చెప్పింది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ సందర్భంగా ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌(iPhone 16 Pro Max) మోడళ్లను భారీ తగ్గింపు ధరకు విక్రయించనున్నట్లు తెలిపింది. ఈనెల 23నుంచి ప్రారంభమయ్యే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో ఈ డిస్కౌంట్‌ లభించనుంది.

ఐఫోన్‌ 16 : ఐఫోన్‌ 16 మోడల్‌ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 79,900 గా ఉంది. దీనిని 34 శాతం తగ్గింపు ధరతో బిగ్‌ బిలియన్‌ డేస్‌(Big Billion Days Sale)లో విక్రయించనున్నట్లు తెలిపింది. అంటే ఐఫోన్‌ 16 మోడల్‌ ఫోన్‌ రూ. 27,901 తక్కువ ధరకు లభించనుందన్న మాట. దీనికి కార్డ్‌ ఆఫర్లు అదనం.. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభించనుంది.

ఐఫోన్‌ 16 ప్రో : ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 1,19,900 గా ఉంది. దీనిని బిగ్‌ బిలియన్‌ డేస్‌లో రూ. 69,999లకు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. అంటే ఐఫోన్‌ ప్రో మోడల్‌ ఫోన్‌పై రూ. 49 వేలు తగ్గనుంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌(Flipkart Axis Bank), ఫ్లిప్‌కార్ట్‌ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ : ఐఫోన్‌ 16 ప్రో మాక్స్‌ మోడల్‌ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ. 1,44,900 గా ఉంది. దీనిని బిగ్‌ బిలియన్‌ డేస్‌లో రూ. 89,999లకు విక్రయించనున్నట్లు సమాచారం. అంటే రూ. 54 వేలపైనే ధర తగ్గనుంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసేవారికి 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. కాగా ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌లపై ఇచ్చే డిస్కౌంట్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Must Read
Related News