అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SBI Notification | క్లరికల్ కేడర్(Clerical cadre)లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎస్‌బీఐ(SBI) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : మొత్తం 6,589. ఇందులో 5,180 రెగ్యులర్ పోస్టులు కాగా 1,409 బ్యాక్‌లాగ్‌వి.
పోస్టుల వివరాలు : జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)
అర్హతలు : సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ(Degree)లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం/ చివరి సెమిస్టర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది చివరినాటికి గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది.
వయోపరిమితి : 20 నుంచి 28 ఏళ్లలోపు వారు అర్హులు. ఓబీసీ(OBC)లకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతన శ్రేణి : నెలకు రూ.24,050 నుంచి రూ.64,480.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
ఫీజు:
జనరల్(General), ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు : రూ.750.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ఎస్ అభ్యర్థులకు పూర్తి ఫీజు మినహాయింపు ఇచ్చారు.
దరఖాస్తుకు చివరి తేదీ : ఈనెల 26.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, స్థానిక భాషా పరీక్షలు నిర్వహించి ప్రధాన పరీక్ష మార్కులు, స్థానిక భాషా పరీక్షలో అర్హత ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. సెప్టెంబర్(September)లో ప్రిలిమ్స్, నవంబర్‌లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయి.
గమనించవలసిన విషయాలు..
ఒక రాష్ట్రం/యూటీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయి.
నియామకం తర్వాత ఇంటర్ సర్కిల్ లేదా ఇంటర్ స్టేట్ బదిలీ ఉండదు.
భాషా నైపుణ్యం :
స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి. స్థానిక భాషను చదివినట్లు రుజువు చేసే 10/12 తరగతుల మార్కుల షీట్‌ను సమర్పించని అభ్యర్థులు తుది నియామకానికి ముందు స్థానిక భాషా పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం, అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/personalbanking ను సందర్శించండి.