HomeజాతీయంRRB Notification | ఆర్‌ఆర్‌బీ నుంచి భారీ నోటిఫికేషన్‌

RRB Notification | ఆర్‌ఆర్‌బీ నుంచి భారీ నోటిఫికేషన్‌

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(RRB) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది. వివిధ విభాగాలలో 5,810 పోస్టులను భర్తీ చేయనుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: RRB Notification | ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (Railway Recruitment Board) శుభవార్త తెలిపింది. నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీ(ఎన్‌టీపీసీ)లో వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం కోసం భారీ నోటిఫికేషన్‌ (Notification) విడుదల చేసింది. నోటిఫికేషన్‌ వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 5,810.

RRB Notification | విభాగాల వారీగా పోస్టుల వివరాలు..

స్టేషన్‌ మాస్టర్‌ (Station master) 161, గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌ 615, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ 3,416, చీఫ్‌ కమర్షియల్‌ కం టికెట్‌ సూపర్‌వైజర్‌ 921, సీనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌ 638, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ 59.

సికింద్రాబాద్‌ (Secunderabad) ఆర్‌ఆర్‌బీ పరిధిలో 396 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో స్టేషన్‌ మాస్టర్‌ 74, గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌ 180, సీనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌ 22, చీఫ్‌ కమర్షియల్‌ కం టికెట్‌ సూపర్‌ వైజర్‌ 34, జూనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్‌ కం టైపిస్ట్‌ 71 పోస్టులున్నాయి.

అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో (Any degree) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కం టైపిస్ట్‌, సీనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌ పోస్టులకు ఇంగ్లిష్‌/హిందీ టైపింగ్‌లో ప్రావీణ్యం అవసరం.

వయోపరిమితి : 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు. నిబంధనల ప్రకారం ఓబీసీ(OBC)లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు గడువు : నవంబర్‌ 20.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..

అప్లికేషన్‌ ఫీజు : జనరల్‌(General), ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ, ట్రాన్స్‌జెండర్లకు రూ. 250.

ఎంపిక విధానం : గూడ్స్‌ ట్రైన్‌ మేనేజర్‌ (Goods train manager), చీఫ్‌ కమర్షియల్‌ కం టికెట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు సీబీటీ 1, సీబీటీ 2 ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.

స్టేషన్‌ మాస్టర్‌ పోస్టులకు సీబీటీ (CBT) 1, సీబీటీ 2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (సీబీఏటీ) ఆధారంగా ఎంపిక ఉంటుంది.

సీనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌, జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కం టైపిస్ట్‌ పోస్టులకు సీబీటీ 1, సీబీటీ 2, టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://www.rrbapply.gov.inలో సంప్రదించగలరు.