అక్షరటుడే, హైదరాబాద్: 10th results : తెలంగాణలో విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న పదో తరగతి ఫలితాలు మరో నాలుగు, ఐదు రోజుల్లో విడుదల కానున్నాయి. ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినందున విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల విభాగం సర్కారుకు దస్త్రం పంపింది. ఉన్నతాధికారులు దానిని సీఎం ఆమోదం కోసం పంపించినట్లు తెలిసింది. ఏప్రిల్ 2న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. 15వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. పది పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు.
