అక్షరటుడే, ఎల్లారెడ్డి : Bichkunda Municipal Results | జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్నిచోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. మరికొన్నిచోట్ల బీజేపీ, బీఆర్ఎస్లు దూసుకెళ్తున్నాయి. అయితే బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ (Congress) హస్తగతం చేసుకుంది.
Bichkunda Municipal Results | బిచ్కుంద మున్సిపాలిటీలో..
బిచ్కుంద మున్సిపాలిటీ (Bichkunda Municipality)లో మొత్తంగా 12 వార్డులు ఉన్నాయి. అందులో 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మిగితా రెండు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయితే ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేదు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు అనంతరం వార్డుల వారీగా ఓట్లను లెక్కగట్టారు.
పోలీస్ బందోబస్తు మధ్య..
కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రం (Counting Center) వద్దకు అనుమతి ఉన్నవారిని తప్ప ఇతరులను రానివ్వలేదు. అలాగే ఎన్నికల కోడ్ ఉన్నందున ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించవద్దని సైతం పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.