అక్షరటుడే, ఎల్లారెడ్డి : Bichkunda Municipality Congress Victory | ప్రజల మద్దతు, ఆశీర్వాదంతో బిచ్కుంద మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (MLA Lakshmi Kantha Rao), కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ (Ele Mallikharjun) అన్నారు. ఈ మేరకు బల్దియాలో విజయం సాధించిన కాంగ్రెస్ వార్డు సభ్యులను శుక్రవారం అభినందించారు.
Bichkunda Municipality Congress Victory | ఏకతాటిపై నిలిచి..
వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేశారని..వారి పట్టుదలను అభినందిస్తున్నామన్నారు. అలాగే బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. మొత్తం పన్నెండు వార్డుల్లో పది వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రజలు తమపై ఉంంచిన నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లో వమ్ము చేయమని.. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.