అక్షరటుడే, బాన్సువాడ: TPUS kamareddy | తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కామారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా భునేకర్ సంతోష్ కుమార్ ఎన్నికయ్యారు. బాన్సువాడ (Banswada) పట్టణంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు.
TPUS kamareddy | ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ..
అలాగే తపస్ ప్రధాన కార్యదర్శిగా చాటాపూర్ సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర బాధ్యులు రవీంద్రనాథ్ ఆర్య, భాస్కరాచారి, మేక రామచంద్రం, పులగం రాఘవరెడ్డి పాల్గొని నూతనంగా ఎన్నికైన జిల్లా నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సంఘాన్ని మరింత బలోపేతం పనిచేయాలని వారు సూచించారు.
TPUS kamareddy | ఉపాధ్యాయుల హక్కుల సాధనకు కృషి..
ఉపాధ్యాయుల హక్కుల సాధనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయ నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా బాధ్యులు రాజశేఖర్, లక్ష్మీపతి, ఆంజనేయులుతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.