అక్షరటుడే, ఇందూరు: Nizamabad collector | ఆగస్టు 15 లోపు భూభారతి (Bhubarathi) రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సూచించారు. మంగళవారం పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Illu), ఎరువుల లభ్యత, ఆయిల్ ఫామ్ పంట (Oil farm crop) విస్తరణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, భూభారతి దరఖాస్తుల పరిష్కారం తదితరంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భారీ వర్షాలు కురవకముందే ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరిగేలా చూడాలని సూచించారు.
Nizamabad collector | ఇళ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా..
ఇళ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ సీనరేజీ చార్జీలు (Synergy charges) కూడా ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. వన మహోత్సవంలో భాగంగా ఇళ్లకు పంపిణీ చేసే మొక్కల పెంపకం సైతం పరిశీలించాలని, మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి జిల్లాలో ఎరువుల లభ్యత స్టాక్పై రివ్యూ పెట్టాలని ఆదేశించారు. జులై వరకు అవసరమైన స్టాక్ ప్రస్తుతం అందుబాటులో ఉందని, సెప్టెంబర్ నాటికి అవసరమైన ఎరువుల స్టాక్ ప్రొక్యూర్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తరించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రైతులకు అవగాహన కల్పిస్తూ పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు జిల్లాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.