అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. నవీపేట తహశీల్దార్ కార్యాలయంతో (Navipet Tahsildar office) పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆశించిన రీతిలో దరఖాస్తుల పరిష్కారం జరగడం లేదన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే చెబుతున్నా జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. వేగవంతంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.
Nizamabad Collector | సాధారణ ప్రసవాలు పెంచాలి
సీహెచ్సీలో సాధారణ ప్రసవాలను పెంచాలని కలెక్టర్ సూచించారు. ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ (OP registration counter), ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, వ్యాక్సినేషన్ రూం, ఆయుష్ విభాగం, ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్, గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు నూరు శాతం జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు.
అనంతరం అంగన్వాడీ సెంటర్ను (Anganwadi center) సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని, కేంద్రాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. అలాగే నవీపేట, దర్యాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. దర్యాపూర్ పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చి వేయించాలని, ప్రహరీ, టాయిలెట్ మరమ్మతుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొన్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్ (Primary Agricultural Cooperative Society fertilizer godown), ప్రైవేటు విక్రయ కేంద్రాలను సందర్శించి నిల్వలను పరిశీలించారు. అవసరాలకు సరిపడా ఎరువులు అందిస్తున్నారా.. అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ వెంకటరమణ, ఏవో నవీన్, వెటర్నరీ డాక్టర్ నరేందర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులున్నారు.