Banswada Sub collector
Banswada Sub collector | భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి

అక్షరటుడే, బాన్సువాడ: Banswada Sub collector | భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub Collector Kiranmayi) సూచించారు. నస్రుల్లాబాద్ తహశీల్దార్ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం(MPDO Office)లో ఇందిరమ్మ ఇళ్లపై ఎంపీడీవో, డీఎల్​పీవో, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి.. నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇల్లు(Indiramma Houses) మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటి నిర్మాణం ప్రారంభించేలా చూడాలని చెప్పారు.