అక్షరటుడే ఇందూరు: Bhubarathi | భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) పేర్కొన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో (Revenue Conference) భాగంగా బుధవారం జక్రాన్‌పల్లి (jakranpally) మండలం మాదాపూర్ (madapur), ముప్కాల్ మండలం, నల్లూరు, కిసాన్ నగర్ గ్రామాల్లో సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న భూసంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్‌డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఒకే దరఖాస్తులో రైతులు రెండు, మూడు రకాల భూసమస్యలను పేర్కొనవచ్చని సూచించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. సదస్సులో ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, తహశీల్దార్ కిరణ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
