అక్షరటుడే, బోధన్:Bhubarathi | ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం(Government) ‘భూభారతి’ని తీసుకొచ్చిందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy) తెలిపారు. పట్టణంలోని లయన్స్ క్లబ్(Lions Club) కంటి ఆస్పత్రి ఆడిటోరియంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైతుల(Farmers) సందేహాలను నివృత్తి చేశారు. ఏళ్ల తరబడిగా పెండింగ్లో ఉన్న సాదాబైనామాల క్రమబద్దీకరణకు భూభారతిలో పరిష్కార మార్గాలున్నాయని ఎమ్మెల్యే వివరించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) మాట్లాడుతూ భూమి వివరాలు ఏమైనా తప్పుగా నమోదైతే భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు గ్రామ రెవెన్యూ రికార్డులను ప్రింట్ తీసి భద్రపరుస్తారని వివరించారు.
ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పోతంగల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రసంగించారు. సదస్సులలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.