అక్షరటుడే, కామారెడ్డి: Bhubarathi | భూభారతి కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు (Revenue Inspectors), సర్వేయర్లతో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట్ (Lingampet) మండలంలో నిర్వహించామని పేర్కొన్నారు. వచ్చే జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో నిర్వహిస్తామన్నారు. భూభారతి (Bhubarathi) సదస్సుల నిర్వహణపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఒకరోజు ముందుగానే దరఖాస్తు ఫారాలను గ్రామాల్లో పంపిణీ చేయాలని సూచించారు.
అంతకుముందు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Banswada Sub-Collector Kiranmayi) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంపై అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, కామారెడ్డి ఆర్డీవో వీణ, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.