అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhopal husband settlement case | మధ్యప్రదేశ్లోని భోపాల్ (Bhopal)లో ఓ మహిళ తన భర్తను అమ్మేసింది. రూ.1.5 కోట్లు తీసుకొని కట్టుకున్న వాడిని మరో మహిళకు అప్పగించింది.
తెలుగు సినిమా శుభలగ్నం (Shubha Lagnam)లో జగపతి బాబును అతడి భార్య రోజాకు విక్రయిస్తుంది. ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు మహిళ భర్తను తన స్నేహితురాలికి విక్రయించడం గమనార్హం. ఫ్యామిలీ కోర్టు (Family Court) సైతం దీనికి ఓకే చెప్పింది. భోపాల్లోని ఓ వ్యక్తి (42)కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే అతడి భార్య స్నేహితురాలు, కొలిగ్ అయిన మహిళ (54)తో అతడికి పరిచయం అయింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతన్నాయి. అతడు తన భార్య పిల్లలను పట్టించుకోవడం మానేశాడు.
Bhopal husband settlement case | కోర్టును ఆశ్రయించిన భార్య
తన భర్త తీరుపై మహిళ కోర్టును ఆశ్రయించింది. భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివాదాన్ని పరిష్కరించడానికి కోర్టు దంపతులతో పాటు అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను సైతం కౌన్సెలింగ్ కోసం పిలిచింది. సెషన్ల సమయంలో భర్త తన స్నేహితురాలితో తన సంబంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు బహిరంగంగా చెప్పాడు. దీంతో అతడి భార్య చట్టబద్ధంగా తన భర్తను వదులుకోవడానికి రూ.1.5 కోట్లు పరిష్కారంగా కోరింది. అంతమొత్తం ఇవ్వడానికి ఆమె స్నేహితురాలు ఒప్పుకుంది. సెటిల్మెంట్ ప్రకారం రూ.27 లక్షల నగదు, భార్యకు డూప్లెక్స్ ఇల్లు భార్యకు ఇవ్వాలి. ఫ్యామిలీ కోర్టు సెటిల్మెంట్ను అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.