- Advertisement -
HomeతెలంగాణMla Bhupathi Reddy | ధర్పల్లిలో అభివృద్ధి పనులకు భూమిపూజ

Mla Bhupathi Reddy | ధర్పల్లిలో అభివృద్ధి పనులకు భూమిపూజ

- Advertisement -

అక్షరటుడే, ధర్పల్లి: Mla Bhupathi Reddy | మండలంలో రూ.12.99 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  (Mla Bhupathi Reddy) బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవింద్​పల్లిలో రూ.1.72 కోట్లు, ఇందిరానగర్ తండాలో రూ.34.06 లక్షలు, ధర్పల్లిలో రూ.9.48 కోట్లు, కాలేజ్ తండాలో రూ.28 లక్షలు, బేలియా తండాలో రూ.31.51 లక్షలు, మరియా తండాలో రూ.26.30 లక్షలు, సల్పబండ తండాలో రూ.47.45 లక్షలు, దమ్మన్నపేట్ లో రూ. 73.53 లక్షలతో బీటీ,సీసీ రోడ్లు, జీపీ భవన నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్న బాలరాజ్, తహశీల్దార్ మాలతి, సొసైటీ ఛైర్మన్లు జనార్ధన్, మల్లిఖార్జున్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News