అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhogapuram Airport | ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల కలగా ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) త్వరలోనే సాకారం కానుంది.
నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న ఈ ఎయిర్‌పోర్ట్, పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విజయనగరం, విశాఖపట్నం (Visakhapatnam), శ్రీకాకుళం జిల్లాలకే కాకుండా ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా ప్రధాన విమాన కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయంపై (Visakhapatnam airport) ఉన్న ప్రయాణికుల భారాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత సౌకర్యవంతమైన విమాన ప్రయాణ అవకాశాలను భోగాపురం ఎయిర్‌పోర్ట్ కల్పించనుంది.
Bhogapuram Airport | తొలి విమానం..
ఈ ఏడాది జూన్ June నెలకు ముందే విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అధికారులు శరవేగంగా పనులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రన్‌వే, టెర్మినల్ భవనం, అనుబంధ మౌలిక సదుపాయాల నిర్మాణం తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. జూన్ నాటికి నిర్మాణ పనులను 100 శాతం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,750 కోట్ల వ్యయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారు. తొలి విడతలో సంవత్సరానికి దాదాపు 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించే సామర్థ్యంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే కొద్దీ దశలవారీగా విస్తరణ చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్య, వ్యాపార రంగాలకు భారీ ఊతం లభించనుంది. ముఖ్యంగా పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ఈ ఎయిర్‌పోర్ట్ కీలకంగా మారనుంది. కొత్త పరిశ్రమలు స్థాపించడంతో పాటు, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరనుంది. మొత్తానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర (Uttarandra) అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవబోతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.