అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Padmashali Sangham | జిల్లా పద్మశాలి సంఘం సభ్యుడు భీమర్తి రవి (Bhimarthi Ravi) రాజీనామా చేశారు. జిల్లాలోని సంఘాలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో తాను జిల్లా పద్మశాలి సంఘం సభ్యత్వానికి, జిల్లా వధూవరుల పరిచయ వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాను ఆమోదించాలని జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడిని కోరారు.
Padmashali Sangham | సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేందుకే..
నగరంలో పద్మశాలి సంఘాలు (Padmashali associations) రెండుగా ఉన్నాయని భీమర్తి రవి పేర్కొన్నారు. వనం దేవిదాస్, దాసరి నర్సింలు ఆధ్వర్యంలో రెండు సంఘాలు పనిచేస్తున్నాయని.. ఈ రెండింటిని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పద్మశాలీలందరూ ఒకే సంఘం గొడుగు కింద ఉంటే.. భవిష్యత్తులో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజీనామాను ఆమోదించినట్లు తెలిసింది.