335
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhikkanoor | కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం పరిధిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫార్మా / కెమికల్ పరిశ్రమకు (ఫ్యూజన్ హెల్త్ కేర్) వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రేపు (బుధవారం) బంద్‌కు భిక్కనూరు యువత పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు భిక్కనూరు కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
Bhikkanoor | బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు
భిక్కనూరు కాంగ్రెస్ కమిటీ నేతలు మాట్లాడుతూ.. మన ప్రాంత భవిష్యత్తు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం యువత చేస్తున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రేపు జరిగే బంద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని, యువతకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.