భీమ్గల్, అక్షరటుడే: Bheemgal Municipality Polling | జిల్లాలోని భీమ్గల్ మున్సిపాలిటీ (Bheemgal Municipality) ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి పోలింగ్ భారీగా నమోదైంది.
Bheemgal Municipality Polling | మధ్యాహ్నం 3 గంటలకు..
పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం 63.65 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 8,940ఓట్లు పోలయ్యాయి. ఓటర్లు స్వచ్ఛందగానే ఓటింగ్లో పాల్గొంటున్నారు.
శాంతియుతంగా పోలింగ్..
ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ముఖ్యంగా మహిళలు బారులు తీరారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం కనబర్చారు. పోలీస్ కమిషనర్ (Nizamabad Police Commissioner) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో, చివరి రెండు గంటల్లో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉదయం 11గంటలకు..
భీమ్గల్ మున్సిపల్ పరిధిలో ఉదయం 11:00 గంటల వరకు 31.09శాతం పోలింగ్ నమోదైంది. 4,367 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.