అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal Municipal Results | ఉత్కంఠభరితంగా సాగిన భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల (Bhimgal Municipal Election) ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది. మొత్తం 12 వార్డులకు గాను 8 వార్డుల్లో కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు ఘనవిజయం సాధించగా, మిగిలిన 4 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
Bheemgal Municipal Results | గెలిచింది వీరే..
ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఆరెపల్లి శ్రీజ, రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పరస కుశలత, మూడో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తోట సతీష్, నాలుగో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గున్నాల బాల లక్ష్మి, ఐదో వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి బొదిరే లావణ్య, ఆరో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బొదిరే నాగమణి, ఏడో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అంజుమ్ అలీ, ఎనిమిదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మమ్మరి సందీప్, 9వ వార్డు బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి నీలం రవి, పదోవార్డు కాంగ్రెస్ అభ్యర్థి సంటి లత, 11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సంఘ్యా నాయక్, 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లెల అనుపమ గెలిపించారు.
కౌంటింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కౌంటింగ్ పరిసరాల్లో పహారా కాస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం (Counting Center)లోని అనుమతించారు. కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.