29
అక్షరటుడే, భీమ్గల్: Bheemgal Municipal Results | భీమ్గల్ మున్సిపాలిటీ (Bheemgal Municipaly)లో ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన మీదట మిగితా ఓట్లను లెక్కించడం ప్రారంభించారు.
Bheemgal Municipal Results | అధికార కాంగ్రెస్ హవా..
కాగా.. పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆధిక్యం చాటుతోంది. ఏడో వార్డులో అంజుం విజయం సాధించారు. అలాగే 2, 3, 6, 7, 8న 10, 11 వార్డుల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అలాగే 12, 4, 5లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది.
కట్టుదిట్టమైన భద్రత నడుమ..
కౌంటింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కౌంటింగ్ పరిసరాల్లో పహారా కాస్తున్నారు. అలాగే గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోని అనుమతించారు.