అక్షరటుడే ,భీమ్‌గల్ : Bheemgal Municipal Chairperson | భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్పర్సన్ పీఠంపై ఉత్కంఠ వీడింది. ఆరో వార్డు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థిని (Congress Candidate) బొదిరే నాగమణి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.మున్సిపల్ కార్యాలయానికి సోమవారం ఉదయం కౌన్సిలర్లు చేరుకున్నారు.
కాంగ్రెస్ కౌన్సిలర్లను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్‌రెడ్డి (Mutyala Sunil Reddy) తీసుకొచ్చారు. అనంతరం కౌన్సిలర్లు కార్యాలయంలోకి వెళ్లారు. మొదట అధికారులు అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా 10వ వార్డు కౌన్సిలర్ సంటి లత ఎన్నికయ్యారు. కాంగ్రెస్ (Congress) అధిష్టానం నిర్ణయం మేరకు.. మొదటి మూడు ఏళ్లు బొదిరే నాగమణి, చివరి రెండేళ్లు ఆరెపల్లి శ్రీజ నాగేంద్ర ఛైర్‌పర్సన్‌గా.. వైస్ ఛైర్‌పర్సన్‌గా మొదటి రెండేళ్లు సంటి లత, చివరి మూడేళ్లు పర్శ కుశలత వ్యవహరించనున్నట్లు సమాచారం.

వైస్‌ఛైర్‌పర్సన్ లత