అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్‌లందరూ కలిసి మండల ఉపసర్పంచ్‌ల ఫోరంను (Mandal Deputy Sarpanches Forum) ఏర్పాటు చేసుకున్నారు. మండల కేంద్రంలో (Bheemgal Mandal) శనివారం నిర్వహించిన ఉపసర్పంచ్‌ల (deputy sarpanches) ప్రత్యేక సమావేశంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల ఫోరం అధ్యక్షుడిగా రహత్‌నగర్ ఉపసర్పంచ్ సేవాలాల్, ఉపాధ్యక్షుడిగా బాబాపూర్ ఉపసర్పంచ్ గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా గోన్‌గొప్పుల శ్రావణ్ కుమార్, కార్యదర్శిగా రూప్లా తండా ఉపసర్పంచ్ అరుణ్, కోశాధికారిగా పిప్రి ఉపసర్పంచ్ రంజిత్ ఎన్నికయ్యారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా పల్లికొండ బాలయ్య, దేవక్కపేట్ లింగారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సేవాలాల్ మాట్లాడుతూ.. మండలంలోని ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి ఫోరం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సహచర ఉపసర్పంచ్‌లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు రమేష్, నర్సింగ్, రాజేష్, శోభన్, ప్రేమ్ చంద్, విమల్, గణేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.