అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal Court | భీమ్‌గల్ పట్టణానికి నూతనంగా కోర్టు మంజూరైంది. ఈ సందర్భంగా శుక్రవారం అఖిలపక్ష నాయకులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌ను (Justice Gadi Praveen Kumar) హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భీమ్‌గల్ మండల (Bheemgal mandal) ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Bheemgal Court | మౌలిక వసతుల కల్పన తర్వాత..
కోర్టు నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, భవన సౌకర్యాలను అధికారులు సమకూర్చిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని న్యాయమూర్తి హామీ ఇచ్చినట్లు అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి మాధవి దేవిని (Judge Madhavi Devi) కలిసి ధన్యవాదాలు తెలిపారు. కోర్టు ఏర్పాటుకు అవసరమైన తాత్కాలిక భవనం, ఇతర సౌకర్యాలను అఖిలపక్షం ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తామని ఆమెకు వివరించారు.
Bheemgal Court | మరమ్మతులకు రూ.20 లక్షలు మంజూరు.. పీసీసీ అధ్యక్షుడు
అనంతరం అఖిలపక్ష సభ్యులు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను (PCC President Bomma Mahesh Kumar Goud) కలిశారు. భీమ్‌గల్‌లో కోర్టు ఏర్పాటుకు సహకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు నిర్వహణ నిమిత్తం పాత ఎంపీడీవో భవనానికి రూ.15 లక్షలు, కోర్టు ఇతర అవసరాలకు రూ.5 లక్షలు మంజూరు చేయాలని నాయకులు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పీసీసీ అధ్యక్షుడు వెంటనే నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. కోర్టు భవన మరమ్మతుల కోసం తక్షణమే రూ. 20 లక్షలు మంజూరు చేయాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో శాశ్వత భవన నిర్మాణం కోసం కూడా కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భీమ్‌గల్ మండల అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.