అక్షరటుడే, భీమ్గల్: Bheemgal Mandal | భీమ్గల్ మండల సర్పంచుల ఫోరం (Bheemgal Mandal Sarpanch Forum) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో (Bheemgal Mandal) నిర్వహించిన సర్పంచుల సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ (election process) చేపట్టారు. ఫోరం మండల అధ్యక్షుడిగా పిప్రి గ్రామ (Pipri village) సర్పంచ్ అరిగెల జనార్దన్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా శ్రీరాం అర్వింద్ (బాబానగర్), బుర్ర దేవేందర్ గౌడ్ (పురానీపేట్), ఉపాధ్యక్షుడిగా భూక్యా రమేష్ (సికింద్రాపూర్ తండా), ప్రధాన కార్యదర్శిగా పిండి అశోక్ (పల్లికొండ), కార్యదర్శిగా దుమాల రాజు (చేంగల్), కోశాధికారిగా సమీర్ (బాబాపూర్)లు ఎన్నికయ్యారు.
Bheemgal Mandal | హక్కుల సాధన కోసం కృషి..
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. సర్పంచుల హక్కుల సాధన కోసం, గ్రామ అభివృద్ధిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. సర్పంచుల సంక్షేమమే ధ్యేయంగా ఫోరం పని చేస్తుందని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు వన్నెల జనార్దన్, చరణ్ గౌడ్, గడాల ప్రసాద్, కార్తీక్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.