అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhartha Mahasayulaku Wignyapthi Trailer | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రిలీజైంది. చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ‘ఈ మధ్య గన్లు, కత్తులు, భోజనాల ఫైట్లు, జాతర ఫైట్లు.. ష్.. తెగ చేసేశాను.. అందుకే మా ఫ్యామిటీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమన్నాడు..’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రవి తేజ తన ఎనర్జిటిక్ డైలాగ్స్‌తో అదరగొట్టారు.
Bhartha Mahasayulaku Wignyapthi Trailer | సినిమా హైప్ పెంచిన ట్రైలర్..
ముందు ఎంటర్టైన్మెంట్.. ఆ తరువాతే అనౌన్స్మెంట్ అంటూ చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. అలాగే బ్యాక్ టు బ్యాక్ కన్నీళ్లు, కత్తిపోట్లు అంటూ వచ్చే డైలాగులు అదుర్స్ అనిపించారు. ట్రైలర్ చూస్తుంటే రవితేజ హిట్ కొడతాడనే అనిపిస్తోంది.
Bhartha Mahasayulaku Wignyapthi Trailer | సంక్రాంతి పండుగకు..
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ డింపుల్ హైయతి (Dimple Hayathi), ఆశికా రంగనాథ (Ashika Ranganath) హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా.. జనవరి 13వ తేదీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ సినిమా నుంచి ఇటీవలే ‘వామ్మో.. వాయ్యో’ పాటను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
