అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కార్యాలయం (Nizamabad Police Office) భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో, అత్యాచార కేసుల్లో బాధితులకు సీపీ శుక్రవారం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనోధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్నారు. భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధితుల కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. ఆయన వెంట ఏసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ జి.రోజా, లీగల్ అడ్వయిజర్ డయాణ గీతిక, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై పుష్పావతి, సిబ్బంది మౌనిక, సవిత, ఎ.ఎన్.ఎమ్లు తదితరులున్నారు.