అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhainsa Municipal Results | నిర్మల్ (Nirmal) జిల్లా భైంసాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు బల్దియాలో బీజేపీ (BJP), బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. 8 వార్డుల ఫలితాలు వెలువడగా.. మూడు చోట్ల ఎంఐంఎ గెలిచింది. ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
గత మున్సిపల్ ఎన్నికల్లో భైంసాలో ఎంఐఎం (MIM), బీజేపీ మధ్య హోరాహోరీగా పోరు సాగగా.. ఎంఐఎం మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ సారి కూడా ఆ పార్టీలతో పాటు కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించడం గమనార్హం. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం ఒకటో వార్డులో ఎంఐఎం, 3వ వార్డు ఎంఐఎం, 5వ వార్డులో ఎంఐఎం, 7, 11, 13, 9, 23 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి కొట్టింది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14 వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించాడు.