అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhainsa Municipal Chairman Election | భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎంకు బీజేపీ (BJP) షాక్ ఇచ్చింది. మున్సిపల్ పీఠం ఆ పార్టీకి దక్కకుండా స్కెచ్ వేసింది. స్వతంత్ర అభ్యర్థిని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకుంది.
నిర్మల్ జిల్లా (Nirmal District) భైంసా మున్సిపాలిటీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పట్టణంలో మొత్తం 26 వార్డులు ఉండగా.. ఎంఐఎం 12 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 6, కాంగ్రెస్ 1 వార్డు గెలిచాయి. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మున్సిపల్ పీఠం కోసం 14 ఓట్లు కావాల్సి ఉండగా.. ఎవరికి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో ఎంఐఎం (MIM)కు పదవి దక్కకుండా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను బీజేపీ బరిలో నిలిపింది. ఛైర్మన్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి తుమొల్ల దత్తత్రి, వైస్ ఛైర్మన్‌గా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి బిబి కుతిజ సిద్దికి ఎన్నికయ్యారు.
Bhainsa Municipal Chairman Election | కాంగ్రెస్ మద్దతు
భైంసా (Bhainsa Municipality)లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్ ఒక్క వార్డులో గెలిచింది. బీజేపీకి చెందిన ఆరుగురు, కాంగ్రెస్ అభ్యర్థి, ఇండిపెండెట్లు స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. మిగతా చోట్ల ప్రధాన పార్టీలు పీఠం కోసం కసరత్తు చేయగా.. ఇక్కడ మాత్రం స్వతంత్ర అభ్యర్థులు గెలవడం గమనార్హం. నిర్మల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ (Nirmal MLA Rama Rao Patel) తన ఎక్స్-అఫీషియో ఓటును కూడా వారికి అనుకూలంగా వేశారు. అయితే దత్తత్రి గతంలో బీజేపీలో కొనసాగారు. ఆయనకు పార్టీ టికెట్ రాకపోవడంతో రెబల్‌గా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం ఏకంగా మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు భైంసా మున్సిపల్ ఎన్నికలపై స్పందించారు. భైంసా మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ విజయవంతంగా ఛైర్మన్ పదవిని దక్కించుకుందన్నారు. ఛైర్మన్‌గా ఎన్నికైన తుమేల దత్తాత్రేయకు అభినందనలు తెలిపారు.