అక్షరటుడే, బాన్సువాడ : Bhagat Singh | భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌సింగ్ పాత్ర ఎంతో కీలకమని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షింధే (Hanmanth Shinde) అన్నారు. బీర్కూర్ మండల (Beerkur Mandal) కేంద్రంలో శుక్రవారం భగత్‌సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Bhagat Singh | త్యాగాలు మరువలేనివి..
ఈ సందర్భంగా భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఆయన చూపిన తెగువతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించి దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో భగత్ సింగ్ చేసిన త్యాగాలు మరువలేనివని గుర్తు చేశారు.
Bhagat Singh | భగత్‌ను ఆదర్శంగా తీసుకుని..
నేటి యువత భగత్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని హన్మంత్ షింధే పిలుపునిచ్చారు. యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. నేటి యువత సోషల్ మీడియా (Social Media)లో ఎక్కువ సేపు గడపకుండా భవిష్యత్తు కోసం బాటలు వేసుకునే విధంగా ప్రణాళికలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మతేజ (Sarpanch Dharmateja), పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, విద్యార్థి సంఘాల నాయకులు శ్రీకాంత్, కృష్ణ, శివకుమార్, నవీన్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.