ePaper
More
    Homeజిల్లాలువరంగల్​Warangal | భద్రకాళి అమ్మవారి బోనాలు వాయిదా

    Warangal | భద్రకాళి అమ్మవారి బోనాలు వాయిదా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | వరంగల్​ (Warangal)లో​ రాజకీయ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మవారికి సమర్పించాల్సిన బోనాలను కూడా రాజకీయ కారణాలతో ప్రభుత్వం వాయిదా వేయడం గమనార్హం. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో కొండా కుటుంబానికి ఇతర కాంగ్రెస్​ ఎమ్మెల్యేకు మధ్య పోరు నడుస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్​రెడ్డిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా వరంగల్​ భద్రకాళి అమ్మవారి (Bhadrakali Temple) బోనాలను వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

    Warangal | గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో..

    వరంగల్​ భద్రకాళి అమ్మవారికి ఈ నెల 22న బోనాలు సమర్పించాలని తొలుత నిర్ణయించారు. ఆగమ శాస్త్రం ప్రకారం అమ్మవారికి శాఖాహార బోనం సమర్పించాలని పండితులు చెప్పారని కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు శాఖాహార బోనాలు ఉంటాయని ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. అయినా కొందరు సోషల్​ మీడియాలో మాంసాహార బోనాలు సమర్పిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రస్తుత రాజకీయ విభేదాల నేపథ్యంలో ఇబ్బందులు పెడతారని బోనాలు వాయిదా వేశామన్నారు. అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రకటించారు.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...