అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tamil Nadu | కొందరు యువత ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్స్‌తో బెట్టింగ్ కాసి ఓ యువకుడు కారును సముద్రంలోకి తీసుకు వెళ్లాడు.
సరదా కోసం, సోషల్ మీడియా (Social Medai)లో ఫేమస్ కావడానికి యువత రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా తమిళనాడులోని కడలూరులో ఫ్రెండ్స్‌తో పందెం కాసి యువకుడు వేగంగా నడుపుతూ కారును సముద్రంలోకి తీసుకెళ్లాడు. కొంత దూరం వెళ్లాక కారు ఆగిపోవడంతో సదరు యువకుడితో పాటు అందులో ఉన్న అతడి మిత్రులు ఖంగుతిన్నారు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది.
Tamil Nadu | రక్షించిన మత్స్యకారులు
కడలూరు (Cuddalore) జిల్లాలోని సోతికుప్పం తీరం సమీపంలో కారు సముద్రంలో చిక్కుకున్న విషయాన్ని మత్స్యకారులు గమనించారు. వెంటనే కారులో ఉన్న వారిని రక్షించారు. అనంతరం ట్రాక్టర్ సాయంతో కారును సైతం బయటకు తీసుకు వచ్చారు. ఆ సమయంలో మహిళలు సహా కారులో ఐదుగురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వారు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. వారిని హెచ్చరించి వదిలిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
Tamil Nadu | నీటితో ఆటలొద్దు
ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. యువత రీల్స్ (Reels), సెల్ఫీల కోసం నీటి సమీపంలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. నీటితో ఆటలాడొద్దని హెచ్చరిస్తున్నారు. స్నేహితులతో బెట్టింగ్‌లు కాసి ప్రమాదకరంగా నీళ్లు ప్రవహిస్తున్న వంతెనల మీద నుంచి వెళ్లడం, ఈతకు వెళ్లడం లాంటివి చేయొద్దన్నారు.