అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్లైన్ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు సంపాదనకు అలవాటు పడుతున్న పలువురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఫోకస్ చేస్తున్నారు.
లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. తీరా అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
తాజాగా ఆన్లైన్ online బెట్టింగ్ యాప్‌లో గేమ్ ఆడి అప్పుల పాలై వాటిని తీర్చే దారి లేక జీవితంపై నమ్మకం సడలి ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన కామారెడ్డి జిల్లా Kamareddy district బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో శుక్రవారం (సెప్టెంబరు 5) చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మాందాపూర్ గ్రామానికి చెందిన లక్కబత్తిని సందీప్ కుమార్ (33) ఆన్లైన్లో బెట్టింగ్ ఆడుతూ అప్పులపాలయ్యాడు.
Betting app case : బంగారు ఆభరణాలు విక్రయించి..
ఆ అప్పులు తీర్చటానికి తన భార్య బంగారు ఆభరణాలు gold ornaments విక్రయించి, కొంత మేర అప్పులు చెల్లించాడు. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు.
వాటిని తీర్చే మార్గంలేక మనస్తాపం చెందిన సందీప్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సందీప్నకు భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.