అక్షరటుడే, హైదరాబాద్: Betting And Cyber Crimes | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులే లక్ష్యంగా నిలువు దోపిడీకి తెగబడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లతో అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. సైబర్ నేరగాళ్ల cyber criminals ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది.
బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్(Hyderabad)లోని సైబరాబాద్ సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు Cyberabad Cyber Crime Branch police పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులున్న ఈ ముఠా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కేంద్రంగా కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.
కూకట్‌పల్లిలో ఉండే అమాయక కార్మికులను వీరు వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ కార్మికుల పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటిని బెట్టింగ్ యాప్స్, సైబర్ నేరాల కోసం వినియోగిస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్లు.
Betting And Cyber Crimes | వైన్స్, కల్లు కంపౌండ్ల వద్ద..
సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ ఈ నేరాల వివరాలు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా సత్యనారాయణ వర్మ అనే వ్యక్తిని పోలీసులు విచారించారు.
కూకట్పల్లి(Kukatpally)లోని ఇద్దరి బ్యాంకు ఖాతాలను బెట్టింగ్ యాప్ కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అరెస్టు చేశాఆరు.
కల్లు కాంపౌండ్, వైన్స్‌ల వద్ద కార్మికులను మచ్చిక చేసుకుని, వారి ఐడీతో ఖాతాలు తెరిచినట్లు విచారణలో వెల్లడైంది. ఇలా సుమారు 100 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.
వీటిలోని రూ. 14 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఏడు అకౌంట్లలో రూ. కోటి గుర్తించారు. సూపగో అనే వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నడుపుతున్నారు.
నిందితుల నుంచి 30 మొబైల్స్, రెండు ల్యాప్ టాప్స్, 32 చెక్ బుక్స్, 48 సిమ్ కార్డ్స్, 23 ఏటీఎం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.