అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | మండలంలోని రామేశ్వరపల్లికి (Rameswarapalli) చెందిన బద్దం ఇంద్రకరణ్ రెడ్డి (Baddam Indrakaran Reddy) టిపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. దీంతో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, డీసీసీ నాయకులు నాగరాజ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చంద్రా గౌడ్ బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వెంకటేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దయాకర్ రెడ్డి, బాపూరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింలు, సాజిద్, ఆంజనేయులు, బాబు పాల్గొన్నారు.
