అక్షరటుడే, బోధన్: Best teachers | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ మండల పరిషత్ హాల్లో శుక్రవారం ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యాశాఖ (Education Department) ఆధ్వర్యంలో మండలస్థాయిలో 20 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికి ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎంఈవో నాగయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో చేస్తున్న విశిష్టమైన సేవలను కొనియాడారు. విద్యార్థుల (students) భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో వారి కృషి ఎంతో ఉందన్నారు. ఈ కార్యమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ఎంపీడీవో మధుకర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి సమాజానికి మార్గదర్శకమన్నారు.
ఉపాధ్యాయులు బాలచంద్రం, హన్మంతు, స్వరూపారాణి, కుందయ లక్ష్మి, రాచప్ప, ఎండీ సలీం, ఆఫ్సర్ ముహజబీన్, వసీం సుల్తానా, రాము, హేమలత, స్మిత, నవతకుమారి, ఆరీఫా బేగం, తన్వీర్ సుల్తానా, ఆసిఫా బేగం, శ్రీనివాస్, అబ్దుల్ ముక్తదార్, సుప్రజ, సీహెచ్ కిరణ్, ఎండీ యుసుఫ్ అలీలను సన్మానించారు.