ePaper
More
    Homeటెక్నాలజీLAVA | లావా నుంచి బెస్ట్‌ గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్.. ప్రారంభ ఆఫర్‌లో రూ. వెయ్యి...

    LAVA | లావా నుంచి బెస్ట్‌ గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్.. ప్రారంభ ఆఫర్‌లో రూ. వెయ్యి తగ్గింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: LAVA | దేశీయ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా (LAVA) మరో మోడల్‌ను లాంచ్‌ చేసింది. సరికొత్త గేమింగ్‌ ఫోన్‌ అయిన లావా ప్లే అల్ట్రా(Lava Play Ultra) 5జీ.. బడ్జెట్‌ ధరలో బెస్ట్‌ గేమింగ్‌ ఫోన్‌ అవుతుందన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేస్తోంది. ఈ మోడల్‌ సేల్స్‌ సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్‌ కింద వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్‌ లభించనుంది. అమెజాన్‌, లావా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం మేరకు ఈ మోడల్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

    LAVA | డిస్‌ప్లే..

    6.67 ఇంచ్‌ ఫుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ ప్లేతో (Full HD+ AMOLED display) వస్తున్న ఈ ఫోన్‌.. 1080 2460 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, IP64 వాటర్‌అండ్‌ డస్ట్‌ రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

    LAVA | ప్రాసెసర్‌..

    మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 15 (Android 15) ఆపరేటింగ్‌ సిస్టం ఆధారంగా పనిచేయనుంది. రెండేళ్ల వరకు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    LAVA | కెమెరా..

    వెనుకవైపు 64 మెగా పిక్సెల్‌ ఏఐ మ్యాట్రిక్స్‌ సోనీ IMX682 మెయిన్‌ కెమెరాతోపాటు 5 మెగా పిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ సెన్సార్‌తో కూడిన డ్యూయల్‌ కెమెరా సెట్‌ అప్‌ కలిగి ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం 13 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంది. ఈ కెమెరాలు నైట్‌మోడ్‌, హెచ్‌డీఆర్‌, బ్యూటీ, పోర్ట్రెయిట్‌, స్లో మోషన్‌, టైమ్‌ ల్యాప్స్‌, ప్రో మోడ్‌ సహా పలు ఫీచర్లను సపోర్ట్‌ చేస్తుంది.

    LAVA | బ్యాటరీ..

    5000mAh బ్యాటరీ సామర్థ్యం గల ఈ ఫోన్‌ 33w ఫాస్ట్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఒకసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 45 గంటల వరకు టాక్‌ టైమ్‌, 510 గంటల వరకు స్టాండ్‌బై టైం ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

    LAVA | వేరియంట్స్‌..

    వైట్‌, మిడ్‌ నైట్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభించనుంది.
    6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999 ఉండే అవకాశాలున్నాయి.
    8 జీబీ ర్యామ్‌ + 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,499 ఉండే అవకాశాలున్నాయి.

    కార్డ్‌ ఆఫర్‌ : ఐసీఐసీఐ అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డ్‌తో 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

    Latest articles

    Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడిన మెడికోలపై కేసులు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Raging in Medical College | ర్యాగింగ్​కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని...

    Teacher suspension | విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్​

    అక్షరటుడే, ఇందూరు: Teacher suspension | నందిపేట మండలం కుద్వాన్​పూర్ (kundwanpur)​ ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన ఘటనపై...

    Drone Attack | రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్​.. అణువిద్యుత్​ కేంద్రంపై డ్రోన్​లతో దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drone Attack | రష్యా–ఉక్రెయిన్​ మధ్య యుద్ధం (Russia–Ukraine War) ఆగడం లేదు. రెండు...

    Vinayaka chavithi | గణపతుల బావి పూడికతీత పనులు ప్రారంభం

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka chavithi | వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సందడి మొదలైంది. ఇప్పటికే గణనాథులను...

    More like this